రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు, తిరు నక్షత్ర వేడుకలు, మణవాళ మహామునుల తిరునక్షత్రోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం నిత్య ఆరాధనలతో పాటు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించారు.
యాదాద్రిలో ఘనంగా తిరు నక్షత్రోత్సవం - yadadri bhuvanagiri district updates
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు, తిరునక్షత్రోత్సవం వైభవంగా నిర్వహించారు. క్షేత్రంలోని బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
![యాదాద్రిలో ఘనంగా తిరు నక్షత్రోత్సవం yadadri thiru nakshatra poojalu in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9278213-216-9278213-1603397314849.jpg)
యాదాద్రిలో ఘనంగా తిరు నక్షత్రోత్సవ వేడుకలు
పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఆచారాలను పాటిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.