తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో తుదిదశకు చేరిన శివాలయం పనులు - yadadri bhuvanagiri district

యాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో భాగంగా శివాలయాన్ని ప్రత్యేక హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కోయంబత్తూరులో ప్రత్యేకంగా ఏకశిలతో విగ్రహాలను తయారు చేయించారు. వాటిని శివాలయం గర్భాలయంపై సిద్ధం చేశారు. ప్రాకారాలపై నంది విగ్రహాలను ఏర్పాటు చేయడానికి శిల్పులు వాటిని చెక్కుతున్నారు.

yadadri-temple-works-in-yadadri-bhuvanagiri-district
యాదాద్రిలో తుదిదశకు చేరిన శివాలయం పనులు

By

Published : Feb 15, 2020, 6:05 PM IST

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శివాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. శివాలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి కోయంబత్తూరులో ప్రత్యేకంగా ఏకశిలతో శివాగమ, గోపుర, పాలకుల విగ్రహాలు తయారు చేయించారు. శివాలయం గర్భాలయం, ప్రాకారాలపై దక్షిణమూర్తి, గణేష్, కాలభైరవ, వీరభద్ర స్వామి, సుబ్రమణ్య స్వామి, చంద్రశేఖరుడు వంటి శివాగమ విగ్రహాలను సిద్ధం చేశారు, ఇప్పటికే శివాలయ గర్భాలయం పైకప్పుపైన విగ్రహాలను ఏర్పాటుచేశారు. వాటి పక్కన గోపుర పాలకుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. శివాలయ ప్రాకారాలపై నంది విగ్రహాలను ఏర్పాటు చేయడానికి శిల్పులు వాటిని తయారుచేస్తున్నారు. ఆ ఆలయంలో ఫ్లోరింగ్, భూగర్భ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి.

కట్టుబడి సున్నంతో పైకప్పు ఫ్లోరింగ్..

ప్రధానాలయం తరతరాలుగా మన్నడానికి, ఆలయం పైకప్పుపై కట్టుబడి సున్నంతో ఫ్లోరింగ్ చేశామని... మరో వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

యాదాద్రిలో తుదిదశకు చేరిన శివాలయం పనులు

ఇవీ చూడండి:యాదాద్రి ఆలయాభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details