యాదాద్రికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా యాడ చర్యలు చేపట్టింది. యాదాద్రిలోని ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్లు, టెంపుల్ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా ‘గ్రీన్ టెర్రామెష్’ విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొదట మెష్‌ను గ్రిల్స్‌తో ఏర్పాటుచేసి ముందుభాగంలో మీటరు మేర ఎర్రమట్టిలో సేంద్రియ ఎరువులు, గడ్డి విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా ఎదిగి ఏడాదంతా పచ్చదనాన్ని పంచుతాయి. ఈ విధానం ద్వారా రూపొందించిన గుట్టలు పటిష్ఠంగానూ ఉంటాయని యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) డీఈఈ మణిబాబు తెలిపారు. ప్రధాన ఆలయం చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఈ గుట్టలు కుంభాభిషేకం నాటికి నాటికి పచ్చదనంతో యాదాద్రి దర్శనమివ్వనుందని పేర్కొన్నారు.
Yadadri Temple: పచ్చదనంతో... సహజత్వం ఉట్టిపడేలా యాదాద్రి పుణ్యక్షేత్రం - telangana news
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని సర్వ హంగులతో యాడ అభివృద్ధి చేస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక శోభతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా చర్యలు తీసుకుంటుంది. ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్లు, టెంపుల్ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా 'గ్రీన్ టెర్రామెష్' విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.
Yadadri Temple
ఇదీ చదవండి: YADADRI: పసిడి వర్ణంలో వెలుగులీనుతూ కనువిందు చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రం