యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపై చేపట్టిన వీఐపీ అతిథిగృహం, ఆలయ ఈవో కార్యాలయ భవనాల నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయానికి పడమటి దిశలో వాస్తురీత్యా రూ.6 కోట్ల వ్యయంతో ఆ రెండు భవనాలను నిర్మించారు. యాడా నిధులతో నిర్మితమైన రెండంతస్తుల సముదాయాల్లో ప్రవేశానికి ఆలయ ఆచారంగా ప్రత్యేక పూజలు జరపాలని నిర్వహకులు యోచిస్తున్నారు. ఈనెల 13న పూజలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
యాదాద్రిలో తుది దశకు చేరిన వీఐపీ అతిథి గృహం పనులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు. వీఐపీ అతిథి గృహం, ఈవో కార్యాలయాల ప్రవేశ పూజలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
యాదాద్రిలో తుది దశకు చేరిన వీఐపీ అతిథి గృహం పనులు
ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు. పుష్కరిణి, ప్రసాదాల కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ వద్ద పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయ పనులు తుది దశకు చేరుకున్నాయి. నడవలేని భక్తుల కోసం పుష్కరిణి ప్రాంగణంలో ఎస్కలేటర్ ఏర్పాటు కానుంది. అందుకోసం చేపట్టిన సివిల్ పనులతో దర్శన వరుసల సముదాయం పెంపునకు మార్గం సుగమం అయిందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:ఘనంగా నాగోబా జాతర ప్రారంభం