యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయ పనుల నిమిత్తం వెండి తొడుగులకు వినియోగించే... 891 కిలోల 489 గ్రాముల వెండిని హైదరాబాద్ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్‌కు అందజేశారు.
చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు - చర్లపల్లిలో ప్రభుత్వ మింట్
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన వెండి కడ్డీలు, తొడుగులు కలశాల తయారీకి వినియోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 891 కిలోల 489 గ్రాముల వెండి కడ్డీలను హైదరాబాద్ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్‌కు బుధవారం తరలించారు.
![చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు Yadadri temple silver move to Cherlapally mint](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10860902-555-10860902-1614803052483.jpg)
చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు
ఆ వెండిని శుద్ధి చేయుట, నాణ్యత ప్రమాణాల కోసం ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహ మూర్తి, ఆలయ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆలయ అధికారులు వెండిని, కొలతలు చేసి లెక్కించి వాటిని ప్రత్యేకంగా తరలించారు.
ఇదీ చూడండి :వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?