యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ప్రధాన, అనుబంధ ఆలయాల పునర్నిర్మాణాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొండపైన విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ, పంచ నారసింహుల ఆలయం చుట్టూ నేల కుంగకుండా పటిష్ఠ పరిచి మరమ్మతు పనులను మరింత ముమ్మరం చేసినట్లు యాడా అధికారులు తెలిపారు.
యాదాద్రి ఆలయానికి తుదిమెరుగులు.. శరవేగంగా పనులు
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా చేపట్టిన హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పూర్తికావొస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలతో.. వర్షం నీరు నిలవకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. శరవేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ పనులను యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి పరిశీలించారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో వర్షం నీరు నిలవకుండా నిర్మాణాలు చేస్తున్నారు. ఉత్తరదిశలో కొండపై రక్షణ గోడ, కొండ కింద వలయ దారి, మొక్కల పెంపకం, కనుమదారిలో పచ్చదనం, ఫౌంటెన్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవ మండపం ఆకర్షణీయంగా కనిపించే విధంగా సైడ్ రేలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణ శిల రాయితో చెక్కిన రేలింగ్ను అమర్చుతున్నారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి పరిశీలించారు. ప్రధానాలయం, ఫ్లోరింగ్ మరమ్మతులు, శివాలయం పుష్కరిణి పనులను పర్యవేక్షించారు.