చక్రవర్తులు, రాజుల కాలాన్ని తలపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి క్షేత్రాన్ని మహా దివ్యధామంగా రూపొందిస్తోంది. ఏక జాతికి చెందిన 2.5 లక్షల టన్నుల కృష్ణ శిలతో సంపూర్ణంగా పంచ నరసింహుల ఆలయాన్ని శిల్పులు తీర్చిదిద్దారు.
రాజుల కాలపు వైభవాన్ని తలపించేలా.. యాదాద్రి క్షేత్ర రూపకల్పన - యాదాద్రి పుణ్యక్షేత్రం వార్తలు
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని శిల్ప కళాఖండంగా రాష్ట్రప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రాజుల కాలాన్ని తలపించేలా ఆలయ మండపాన్ని రూపొందిస్తున్నారు. కాకతీయ స్థూపాలు, ఆళ్వారుల ప్రతిమలతో గర్భాలయం ముంగిట మహా ముఖమండపం భక్తితత్వాన్ని పెంచేట్లు ఆవిష్కరిస్తున్నారు.
రాజుల కాలపు వైభవాన్ని తలపించేలా యాదాద్రి క్షేత్ర రూపకల్పన
ప్రాచీన కళా రూపాలు, దేవతా మూర్తులు, నలువైపులా... మహావిష్ణు సేవకుడైన గరుడ ఆళ్వారులు, రాజగోపురాలు భక్తులకు కనువిందు గొలుపనున్నాయి. కాకతీయ స్థూపాలు, ఆళ్వారుల ప్రతిమలతో గర్భాలయం ముంగిట మహా ముఖమండపం భక్తితత్వాన్ని పెంచేట్లు ఆవిష్కృతమవుతోంది.