Yadadri reconstruction works: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు విరాళాల సేకరణ కొనసాగుతోంది. భక్తజనుల నుంచి విరాళాల సేకరణకు సెప్టెంబరు 25న దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు బంగారం 2360 గ్రాములు, నగదు రూ.9,63,26,656 భక్తుల ద్వారా సమకూరినట్లు ఈవో గీత తెలిపారు. 45 అడుగుల ఎత్తున్న దివ్య విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు 65 కిలోల బంగారం అవసరమని యాడా యంత్రాంగం భావించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి గత పర్యటనలో భక్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు, భక్తులు స్పందించి నేరుగా చెక్కులు, డీడీలు, చలాన్, క్యూఆర్ కోడ్‌ల ద్వారా వితరణ చేస్తున్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆ లోపు విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు యాడా విరాళాల సేకరణను మరింత ముమ్మరం చేయనుంది. కాగా గతంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన విరాళం దేవస్థానానికి ఇంకా అందాల్సిఉంది.
యాదాద్రి ఆలయం చెంత దుర్గంధం...