పునర్నిర్మితమైన ఆలయాలతో యాదాద్రి పుణ్యక్షేత్రం శోభిళ్లనుంది. పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విలసిల్లుతున్న ఆలయాన్ని కృష్ణశిలతో రూపొందించిన విషయం తెలిసిందే. మండప ప్రాకారాలలోని స్థూపాలపై పలు రకాల రూపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ నారసింహ రూపాలు, హిరణ్య కశ్యపుడి సంహరం, దేవతా మూర్తులు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భక్త ఆంజనేయుడు మొదలైన అవతారాలు మండప ప్రాకారాల్లో తీర్చిదిద్దారు.
పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం - యాదాద్రి పుణ్యక్షేత్రం
యాదాద్రి పుణ్యక్షేత్రం శిల్పకళా సంపదతో అలరారనుంది. ఇప్పటికే మండప ప్రకారాలపై నిర్మించిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం
ఇవే కాకుండా సింహం, రామచిలుక, చేపలు, సర్పం లాంటి పలు ప్రాణులను సాక్షాత్కరింప జేయడం విశేషం. కొండ కింద గిరి ప్రదర్శన దారిలో ఆహ్లాదాన్ని పంచే విధంగా... పచ్చదనం విరబూసేలా రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు.