రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు... సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో చేపట్టిన యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో కొండ కింద మొక్కులు తీర్చుకొనే భక్తులకు తగు వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. గండిచెర్వు వద్ద ఇప్పటికే 93 ఏకరాల భూసేకరణ చేశారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా రూ. 60 కోట్ల వ్యయంతో వివిధ వనరుల కల్పనకు కట్టడాలు చేపట్టారు.
నిత్యాన్న ప్రసాద సముదాయం...
నమ్మిన దేవుడి దర్శనానికై వచ్చిన భక్తులకు ఆకలి బాధలు కలుగకుండా స్వామివారి నిత్యాన్న ప్రసాదం అందించేందుకు యాడా నిర్ణయించింది. ఆరున్నర కోట్లతో రెండంతస్తుల సముదాయాన్ని నిర్మించే పనులు జరుగుతున్నాయి. హారేరామ హరికృష్ణ, అక్షయ పాత్ర వారి సూచనలతో ఒకేసారి 720 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేలా నిర్మిస్తున్నారు. వంటశాల, అవసరమయ్యే సరుకుల భద్రతకు స్టోర్ ఏర్పాటు కానుంది.
నిత్యాన్న ప్రసాద సముదాయం... కల్యాణకట్ట...
తలవెంట్రుకలను తీయించుకుని మొక్కలు సమర్పించే వారికోసం ప్రస్తుతం దీక్షా మండపాన్ని రూ. 9 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆ మండపం
మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. సీఎం వచ్చి వెళ్ళాక ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వ్రత మండపం...
ఈ క్షేత్ర స్థాయికి తగ్గట్లు అదే చోటరూ. 18 కోట్లతో ప్రత్యేక సముదాయ నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. తొలిగా ఒకేసారి 250 వ్రతాలు జరుపుకొనే సదుపాయాలు మండపంలో ఏర్పాటు కానున్నాయి.
రూ.11 కోట్లతో గుండం...
క్షేత్రానికి వచ్చే భక్తజనుల మొక్కుల్లో భాగంగా భక్తుల పుణ్య స్నానాలకై సంప్రదాయంగా మౌలిక సదుపాయాలతో సీఎం కేసీఆర్ చేసిన నామకరణంతో లక్ష్మీ పుష్కరిణి నిర్మాణం వేగవంతమైంది. ఆహ్లాదం, మానసిక ఉత్తేజాన్ని కలిగించే తీరులో పుష్కరిణి సిద్ధం కానుంది. ఈ పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: శివుడి నివాసం ఎలా ఉంటుంది?