తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri temple reconstruction: మహాదివ్యంగా, సంప్రదాయ హంగులతో యాదాద్రి పునఃనిర్మాణం - Temple City

శ్రీ లక్ష్మీ నారసింహుడు స్వయంభుగా వెలసిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం(Yadadri temple reconstruction) తుది మెరుగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ధృడ సంకల్పంతో చేపట్టిన నారసింహుని సన్నిధి.. స్వర్ణకాంతులతో విరాజిల్లుతోంది. ఆలయ రాజగోపురాలు పసిడి వర్ణాన్ని నింపుకొని భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంచుతోంది.

yadadri temple reconstruction works
యాదాద్రి పునఃనిర్మాణం

By

Published : Nov 21, 2021, 2:54 PM IST

భక్త జన బాంధవ్యుడైన యాదాద్రీశుడి(Yadadri temple reconstruction) సన్నిధిని తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏక జాతికి చెందిన కృష్ణశిలతో పునర్నిర్మితమైన పంచనారసింహుల ఆలయాన్ని మహాదివ్యంగా రూపొందిస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా సకల హంగులతో తీర్చిదిద్దుతున్నారు.

పసిడి వర్ణాలను అద్దుకున్న స్తంభాలు

వీఐపీల కోసం నిర్మిస్తున్న లిఫ్టును హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ రాజగోపురాలు వెలుగులతో విరాజిమ్మేలా ఎదురుగా పసిడి వర్ణంతో కూడిన సంప్రదాయంగా గల స్తంభాలను బిగిస్తున్నారు.

ముమ్మరంగా సాగుతున్న యాదాద్రి పునఃనిర్మాణ పనులు

చకాచకా పనులు

యాదాద్రి పుణ్య క్షేత్రాభివృద్ధిలో(Yadadri temple latest news) భాగంగా కొండపైకి వచ్చి, పోయే మార్గాల విస్తరణతో సహా పై వంతెనల నిర్మాణం జోరందుకుంది. కొండెక్కి, దిగే కనుమదారులకు రెండు దిక్కులా పైవంతెనలు నిర్మిస్తున్నారు. కొండకు ఉత్తరదిశలో 12మీటర్లు వెడల్పు, 650 మీటర్ల పొడవున కట్టే వంతెనకు రెండో ఘాట్ రోడ్డుకు కలపనున్న వంతెన పిల్లర్​కు వేయాల్సిన 22 స్లాబుల్లో... 14 పూర్తైనట్లు యాడా అధికారులు తెలిపారు. రూ.143 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వలయదారి ప్రణాళికల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నారు. పాత కనుమదారి విస్తరణతో పాటు కొండెక్కేందుకు చేపట్టిన పైవంతెన కోసం పిల్లర్ల పనులు వేగవంతం చేశారు.

సంప్రదాయ హంగులతో యాదాద్రి పునఃనిర్మాణం

టెంపుల్​ సిటీగా

మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు ప్రభుత్వం పునఃర్నిర్మాణం చేపట్టింది. చినజీయర్‌ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయి. ఆయన సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్నిర్మాణం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్‌ సిటీ (Temple City) నిర్మాణం జరిగింది.

మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

గత నెల అక్టోబరు 19న యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ (Cm Kcr Yadadri Tour) మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ (Mahakumbha Samprokshana) ఉంటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు.

స్వర్ణ విమాన గోపురం

యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించగా.. అందుకు తగినట్లుగా భారీ ఎత్తున విరాళాలు, బంగారం సమకూరింది. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం కాగా.. యాదాద్రికి తొలి విరాళంగా సీఎం కేసీఆర్​.. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇచ్చారు. ఇప్పటి వరకు పలువురు దాతలు, వ్యాపార వేత్తలు, ప్రజాప్రతినిధులు బంగారం లేదా నగదు రూపంలో విరాళం అందించారు.

ఇదీ చదవండి:Yadadri temple latest news: కొండపైన స్వర్ణకాంతులు.. కొండకింద వెండి వెలుగులు

ABOUT THE AUTHOR

...view details