తెలంగాణ

telangana

ETV Bharat / state

తుది దశలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు - యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ వార్తలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రూ.45కోట్లతో ఆలయం తుదిదశ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరువరకు పనులు పూర్తిచేయాలని సీఎంవో కార్యాలయం సూచించినట్లు సమాచారం.

తెలంగాణ వార్తలు
యాదాద్రి వార్తలు

By

Published : Apr 26, 2021, 6:56 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణపనులు తుది దశకు చేరుకున్నాయి. విష్ణు పుష్కరిణి పునరుధ్ధరణ, హరి హరుల రథశాలలు, మెట్ల దారి, ఉత్తరాన రక్షణగోడ, ఆలయ స్వాగత తోరణం, ఎస్కలేటర్, లిఫ్ట్​, వాటర్​ ఫాల్​, కనుమ రహదారి విస్తరణ, వాహనాల మినీ పార్కింగ్​ పనులు వచ్చే నెలఖరులోగా పూర్తి చేసేందుకు యాడా ప్రయత్నిస్తోంది.

పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తెలుసుకుంటున్నారు. కొవిడ్​ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వెళ్లిపోవడం వల్ల నిర్మాణ పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతోంది.

ఇదీ చూడండి:ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని భూగర్భ డ్రైనేజీ నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details