తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Temple: పూజలు, ప్రసాదాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి.. - యాదాద్రిలో పూజల ధరలు

Yadadri Temple Prasadam Price: యాదాద్రి పంచ నారసింహ పుణ్యక్షేత్ర అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇదిలా ఉండగా.. యాదాద్రిలో పూజలు, ప్రసాదాల ధరల పెంచుతూ ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Yadadri Temple, Yadadri Temple Prasadam Price
యాదాద్రి ఆలయం

By

Published : Dec 10, 2021, 7:08 AM IST

Yadadri Temple Prasadam Price: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలు పెరిగాయి. ఈ మేరకు కార్యనిర్వహణ అధికారి గీత గురువారం ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆరేళ్లుగా పూజలు, ప్రసాదాల ధరలు పెంచలేదని వివరించారు. కొవిడ్‌ కారణంగా ఆలయ ఆదాయం కుంటుపడిందని, జీతభత్యాలతో ఆర్థికభారం పెరిగిన దృష్ట్యా ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అనుబంధ ఆలయాల్లోనూ పెరిగిన ధరలు వర్తిస్తాయని వివరించారు.

పెంపుదల ఇలా..

వీవీఐపీలు సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్‌ ధరను రూ. 1,500గా నిర్ణయించారు. ఇంతకుముందు ఈ టికెట్‌ లేదు. లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణం టికెట్‌ ధర రూ. 1,250 నుంచి రూ. 1,500కు పెరిగింది. నిజాభిషేకానికి రూ.500 నుంచి రూ.800కు, సుదర్శన హోమం రూ.1,116 నుంచి రూ. 1,250కి, సువర్ణ పుష్పార్చన రూ. 516 నుంచి రూ. 600, వేదాశీర్వచనం రూ. 516 నుంచి రూ. 600, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ రూ. 750 నుంచి రూ. 1,000, సత్యనారాయణ వ్రతం (సామగ్రితో కలిపి) రూ. 500 నుంచి రూ. 800, స్వామివారికి అష్టోత్తరం టికెట్‌ ధరను రూ. 100 నుంచి రూ. 200కి పెంచారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ. 20నుంచి రూ. 30, 500 గ్రాముల లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 150, 250 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ ధర రూ. 15 నుంచి రూ. 20, 250 గ్రాముల వడ రూ.15 నుంచి రూ.20కి పెరిగాయి.

ఇదీ చూడండి:Yadadri renovation: 'బంగారు' యాదాద్రి.. గర్భాలయ ద్వారాలకూ స్వర్ణ తాపడం

ABOUT THE AUTHOR

...view details