తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Temple: కేవలం 20 రోజుల్లో రూ.1.25 కోట్లకు పైగా ఆదాయం.. - యాదగిరిగుట్ట

Yadadri temple hundi Income: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. కార్తిక మాసం కావడంతో హుండి ఆదాయం అమాంతం పెరిగింది. ఇవాళ స్వామివారి హుండిని లెక్కించగా కోటి 25 లక్షల 56 వేల 990 రూపాయలు, బంగారం, వెండి భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

Yadadri temple hundi counting
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండి లెక్కింపు

By

Published : Nov 30, 2021, 7:38 PM IST

Yadadri temple hundi Income: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి 20 రోజుల్లోనే కోటికి పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ హుండీ ఆదాయం ఆలయ అధికారులు లెక్కించారు. ఆలయ సన్నిధిలో కొండపైన గల హరిత హోటల్​లో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కార్తిక మాసం కావడంతో కేవలం 20 రోజుల్లోనే హుండీ ఆదాయం కోటి 25 లక్షల 56 వేల 990 రూపాయల నగదు, 133 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 450 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ హుండి లెక్కింపు

కార్తిక మాసంతో పెరిగిన భక్తుల రద్దీ

devotees rush in yadadri: పవిత్రమైన కార్తిక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ వ్రత పూజలు, నిత్య కల్యాణంలో పెద్దఎత్తను పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయ ఖజానాకు ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఆలయ పునర్మిర్మాణ పనులు

Yadadri works: మరోవైపు యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించనున్నారు.

మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

CM KCR Visit: గత నెల అక్టోబరు 19న యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు.

భారీగా బంగారం విరాళం

gold donations:యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించగా.. అందుకు తగినట్లుగా భారీ ఎత్తున విరాళాలు, బంగారం సమకూరింది. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరం కాగా.. యాదాద్రికి తొలి విరాళంగా సీఎం కేసీఆర్​.. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇచ్చారు. ఇప్పటి వరకు పలువురు దాతలు, వ్యాపార వేత్తలు, ప్రజాప్రతినిధులు బంగారం లేదా నగదు రూపంలో విరాళం అందించారు.

ABOUT THE AUTHOR

...view details