యాదాద్రి ఆలయ క్షేత్ర అభివృద్ధిలో భాగంగా కనుమ దారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఐదు అడుగుల మేర రాతిగోడను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలగించిన పాత కనుమ దారి రోడ్డు.. ప్రస్తుతం నిర్మిస్తున్న రాతి గోడకు మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఎర్రమట్టితో నింపి దానిపై తారు రోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి ఘాట్ రోడ్డు విస్తరణ పూర్తైతే.. కొండ పైకి చేరుకోవడానికి ఒకటి.. కిందకు రావడానికి మరో రహదారి ఉండేలా నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ ఈఈ వసంత నాయక్ అన్నారు.
యాదాద్రి ఆలయ ఘాట్ రోడ్డు కనుమదారి విస్తరణ పనులు వేగవంతం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కనుమ దారి రోడ్డు విస్తరణ నిర్మాణం కోసం ఐదడుగుల మేర రాతిగోడను నిర్మిస్తున్నారు. మరోవైపు నవగ్రహ వనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
యాదాద్రి ఆలయం, యాదాద్రి కనుమదారి
యాదాద్రిలో నవగ్రహ వనం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తులసి కాటేజీలో నక్షత్రవనం ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి రోజున.. భక్తులు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నవగ్రహ వనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితముంటుందని పండితులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి :రాష్ట్రంలో నేడూ రేపూ వడగాలులు!