తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి అభివృద్ధి పనుల్లో పెరిగిన వేగం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో అధికారులు వేగం పెంచారు. యాదాద్రిలో జరుగుతున్న ప్రధానాలయ పనులను యాడ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి పరిశీలించారు. రాజ గోపురాలు, ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులను పరిశీలించారు.

yadadri teయాదాద్రి అభివృద్ధి పనుల్లో పెరిగిన వేగంmple development works speed up
యాదాద్రి అభివృద్ధి పనుల్లో పెరిగిన వేగం

By

Published : Feb 24, 2021, 8:23 AM IST

యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన పనులను ముమ్మరం చేశారు. ఒకవైపు నిర్మాణాలు మరోవైపు శిలల బిగింపునతో క్షేత్రం సందడిగా మారింది. కొండ కింద వైకుంఠ ద్వారం చెంత కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ఇరువైపులా మెట్ల వంతెన నిర్మిస్తున్నారు. కొండపై ఆలయ సన్నిధిలో ఏసీ విద్యుత్ సరఫరా కోసం పైపు లైన్లు ఏర్పాటు చేపట్టారు.

యాదాద్రిలో జరుగుతున్న ప్రధానాలయ పనులను యాడ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి పరిశీలించారు. రాజ గోపురాలు, ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులను ఆయన పరిశీలించారు. వీటి నిర్మాణాలు ఈనెల 26 వరకు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శివాలయంలోని హోమగుండం, నవగ్రహ మండపాన్ని పరిశీలించి.. పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి:కరెంటు లెక్కలు.. రైతులకు తప్పని చిక్కులు!

ABOUT THE AUTHOR

...view details