యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో భాగంగా కొండ దిగువన ఉన్న సింహ ద్వారానికి (వైకుంఠ ద్వారం)యాడ అధికారులు ప్రత్యేక హంగులు చేయిస్తున్నారు. సింహ ద్వారం రాజగోపురానికి వెళ్లేందుకు కింద నుంచి మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికిరుపక్కల రేలింగ్ పనులు చేస్తున్నారు. కొండపైకి వెళ్లడానికి ముందు సింహ ద్వారం వద్ద మెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేసి నడక ప్రారంభించడం ఆనవాయితీ.
యాదాద్రి సింహ ద్వారానికి ప్రత్యేక హంగులు - యాదాద్రి ఆలయం వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాడా అధికారులు ఆలయ అలంకరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకింద ఉన్న సింహ ద్వారాన్ని ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
యాదాద్రి జిల్లా వార్తలు
మొదటి మెట్టు వద్ద టెంకాయలు కొట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సింహ ద్వారం వద్ద అందమైన శిల్పాలు చెక్కిస్తున్నారు. మరోవైపు యాదగిరిగుట్ట ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:కేంద్రం వల్లే వ్యాక్సినేషన్ జాప్యం : మంత్రి హరీశ్