యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. సీఎం సూచనలతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. దేశ, విదేశీ ప్రముఖుల విడిది కోసం ప్రత్యేక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.
సర్వాంగ సుందరం.. శరవేగంగా ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం - అత్యాధునిక సౌకర్యాలతో విడిది భవనాల నిర్మాణం
రాష్ట్రంలో మరో తిరుపతిగా భావించే యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దేశ, విదేశీ ప్రముఖుల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దాతలు ఇచ్చే విరాళాలతో వీటిని నిర్మిస్తున్నట్లు వైటీడీఏ అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక హంగులతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి
ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద రోడ్ల విస్తరణ, ప్రత్యేక సదుపాయాలతో భవనాల నిర్మాణం చేపడుతున్నారు. కొండకింద ఉత్తరగిరిపై రూ.104 కోట్ల అంచనా వ్యయంతో ఒక ప్రెసిడెన్షియల్ సూట్, 14 విల్లాలు నిర్మితమవుతున్నాయి. దాతలు ఇచ్చే విరాళాలతో అత్యాధునిక సౌకర్యాలతో వీటి నిర్మాణం జరుగుతోందని వైటీడీఏ అధికారులు వెల్లడించారు.