తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌లోనూ నిర్విరామంగా యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులు - telangana varthalu

ఆపద్భాంధవుడు... లోక సంరక్షకుడు.. శ్రీలక్ష్మీ సమేతుడైన నారసింహుడి క్షేత్రాన్ని మహాదివ్యంగా రూపొందించే పనులు యథావిధిగా కొనసాగించాలని యాడా యంత్రాంగం భావిస్తోంది.లాక్​డౌన్ అమలులోనూ యాదాద్రి క్షేత్రాభివృద్ది పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Yadadri temple development works
లాక్‌డౌన్‌లోనూ నిర్విరామంగా యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులు

By

Published : May 13, 2021, 3:19 AM IST

లాక్‌డౌన్ అమలులోనూ యాదాద్రి క్షేత్రాభివృద్ది పనులను మరింత ముమ్మరం చేయాలని యాడా అధికారులు యోచిస్తున్నారు. కొండపై చేపట్టిన పనులన్నింటినీ కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్మికుల అవసరాలు తీరుస్తూ... అవసరమైతే మరింత మందిని రప్పించాలని యాడా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

లాక్‌డౌన్‌ కారణంగా భక్తులు రాకపోవడంతో కొండపై ఆటంకాలు కలగకుండా పనులు వేగవంతం చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా బుధవారం కొండపైనే గాకుండా... కొండ కింద గండి చెరువు వద్ద కట్టడాలను కొనసాగించారు.

ఇదీ చదవండి: మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్​ ప్రార్థనలు చేయాలి: హోంమంత్రి

ABOUT THE AUTHOR

...view details