తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

యాదాద్రి ఆలయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెంపుల్ పనులను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పరిశీలించారు. కొలనుపాక టెంపుల్​ అభివృద్ధిపై కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు.

Yadadri temple development work inspected the aleru MLA gongidi sunitha
యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Aug 2, 2020, 8:23 AM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సందర్శించారు. టెంపుల్ సిటీలో జరుగుతున్న పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను కోరారు. యాదగిరిగుట్ట చుట్టు పక్కల ఉన్న పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలని యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావుకు ఎమ్మెల్యే సూచించారు.

ఆలేరు మండలం కొలనుపాకలోని జైన మందిరం, సోమేశ్వర ఆలయాలకు కూడా నిధులు సమకూర్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. యాదాద్రికి వచ్చే భక్తులు నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం సమీప ఆలయాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి :కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details