తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని... రేపు రాహుగ్రస్త చూడామణి నామక సూర్య గ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి మూసివేయనున్నారు. యథావిథిగా ఇవాళ స్వామివారికి ఆరగింపు నిర్వహించి రాత్రి 8 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు.
ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి ఆరాధన ఆరగింపు చేసి... సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనాలు అనుమతించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి యథావిథిగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని, పెద్దవారి సహకారం తీసుకోవాలని సూచించారు.