తెలంగాణ

telangana

ETV Bharat / state

వేగాద్రి: ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఆలయ నగరికి వెళ్లేదారిలో రోడ్డు పనులను ప్రారంభించారు. మట్టి దారిపై కంకర ఏర్పరచి.. చదును పనులు చేపట్టారు.

వేగాద్రి: ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం
వేగాద్రి: ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం

By

Published : Feb 13, 2021, 9:35 AM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా వలయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండ కింద గల గండి చెరువు ప్రాంగణంలో టెంపుల్​ సిటీ పైకి వెళ్లే దారి పనులు చేపడుతున్నారు. శుక్రవారం నాడు మట్టి దారిపై కంకర ఏర్పరచి.. చదును పనులు చేపట్టారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం

ఆలయనగరికి వెళ్లేందుకు తులసి కాటేజ్​ నుంచి ఒక మార్గం ఇప్పటికే పూర్తికాగా... ప్రస్తుతం రెండవ అప్రోచ్​ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. మల్లాపురం మార్గంలోని సర్కిల్​ నుంచి ప్రెసిడెన్షియల్​ సూట్ భవనాలకు వెళ్లేందుకు మరో మార్గం ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. కూలీల సంఖ్య పెంచుకుని పనుల్లో వేగం పెంచాలని ఇటీవల యాదాద్రిలో పర్యటించిన రోడ్ల భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి గుత్తేదారులకు సూచించారు.

ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం

కొండ చుట్టూ వలయ రహదారి పనుల్లో భాగంగా గండి చెరువు ప్రాంగణం వద్ద సర్కిల్​ను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వర్షపునీరు, మురుగు నీరు పారుదలకై డ్రైనేజీ నిర్మాణము చేపట్టారు. ఇప్పటికే ఈ పనుల్లో యాడా అధికారులు వేగం పెంచారు.

ఆలయనగరి రోడ్డు పనులు వేగవంతం

ABOUT THE AUTHOR

...view details