యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. ప్రధానాలయంలో క్యూలెైన్ పనులు, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తెప్పించిన సాలహారాల్లో పొందుపరిచే దేవతా మూర్తుల విగ్రహాలు బిగించే పనులు నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిల్పాల పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రధానాలయం శుద్ధి పనులు చేపట్టాల్సి ఉందని ఆనంద్ తెలిపారు.
పసిడి వెలుగుల్లో యాదాద్రి.. పరవశంలో భక్తులు - yadadri temple architect anand sai
యాదాద్రి ఆలయాన్ని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి సందర్శించారు. ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్, ప్రథమ ద్వితీయ ప్రాకారాల్లో ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు.
ప్రధాన ఆలయంలో, ప్రథమ ద్వితీయ ప్రాకారాలకు బెంగళూరులోని లైటింగ్ టెక్నాలజీ కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిన పసిడి కాంతుల లైటింగ్ లను వైటీడీఏ అధికారులు బిగించి పరిశీలించారు. ఈ లైటింగ్‌తో ఆలయం మరింత శోభను సంతరించుకోనుందని ఆనంద్ అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తుదిమెరుగు పనులను వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పరిశీలించారు. రథశాల, లిఫ్ట్‌లో వైరింగ్ పనుల గురించి ఆరా తీశారు. రక్షణ గోడ వంటి నిర్మాణాలు గడువులోగా పూర్తి చేసే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
- ఇదీ చూడండియాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ