యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేలోగా పెండింగ్, ప్రధాన ఆలయం పనులు పూర్తి చేయాలని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆదేశించారు. కొండపైన విష్ణు పుష్కరిణి, కొండ కింద వైకుంఠ ద్వారం, రింగ్ రోడ్డు, మెట్ల నిర్మాణాలు పరిశీలించారు.
మొదటగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. కొండ పైన ప్రధాన ఆలయ మాడవీధులు, ప్రసాద కాంప్లెక్స్, రథశాల, లిప్టు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గండి చెరువు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పుష్కరిణి, దీక్ష పరుల మండపం, అన్నదాన (సత్రం) భవనం, కల్యాణ కట్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు.