తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రికి దక్కిన మరో ఘనత.. ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా ఎంపిక - Yadadri as a spiritual green shrine

Yadadri Temple was selected as a green shrine: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మరో ఘనత లభించింది. 2022-25 సంవత్సరానికిగాను ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా దిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి ఎంపిక చేసింది. 13వ శతాబ్ధానికి చెందిన ఆలయం లోపలి శిలలను సంరక్షించడం, ప్రధానాలయంలోని మూలవర్యులను ముట్టుకోకుండా.. స్వయం భూ విగ్రహాలను తాకకుండా పునర్నిర్మాణంలో ఆలయ ప్రాశస్త్యం కాపాడటాన్ని ప్రశంసించింది.

యాదాద్రికి దక్కిన మరో ఘనత
యాదాద్రికి దక్కిన మరో ఘనత

By

Published : Oct 21, 2022, 9:41 AM IST

Yadadri Temple was selected as a green shrine: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారానికి.. దిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి ఎంపికచేసింది. 2022-25 సంవత్సరానికిగాను ఆలయాన్ని ప్రకటించి యాదాద్రి దేవాలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వీసీ కిషన్‌రావుకు హైదరాబాద్‌లో అందించారు. 13వ శతాబ్ధానికి చెందిన ఆలయం లోపలి శిలలను సంరక్షించడం, ప్రధానాలయంలోని మూలవర్యులను ముట్టుకోకుండా.. స్వయం భూ విగ్రహాలను తాకకుండా పునర్నిర్మాణంలో ఆలయ ప్రాశస్త్యం కాపాడటాన్ని ప్రశంసించింది.

Indian Green Building Council

సుందరీణకరణ పనులు చేపట్టడంతో పాటు ప్రత్యేక సూర్యవాహిక ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసరించేలా నిర్మాణం చేయడాన్ని భారతీయ హరిత భవనాల మండలి కొనియాడింది రద్దీ భారీగా ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు వంటిని పరిశీలించి అవార్డు ప్రకటించినట్లు భారతీయ హరిత భవనాల మండలి వెల్లడించింది. ఆ పురస్కారం రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కడం రాష్ట్రంతో పాటు భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి లభిస్తున్న గొప్ప గౌరవమని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం భారతీయ ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నిదర్శనంగా నిలిచిందని కేసీఆర్‌ వెల్లడించారు. హరిత భవనాల మండలి ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లేలా శ్రీ లక్ష్మీ నరహింహ స్వామి కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలని సీఎం కేసీఆర్‌ ప్రార్ధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details