రాష్ట్రానికి వన్నె చేకూర్చేలా రూపొందుతున్న యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో.. అధికారులు తిరుమల దేవస్థానం తరహాలో హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మితమైన ప్రధాన ఆలయంలో ఆరుచోట్ల.. రాగి పాత్ర శ్వేత వస్త్రంతో కూడిన హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో గీతా తెలిపారు. సదరు హుండీలను తిరుపతిలోని శ్రీ వెలన్ క్రియేషన్ ఆధ్వర్యంలో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు.
మహాదివ్య పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏర్పాటయ్యే ప్రత్యేక హుండీల కోసం హైదరాబాద్కు చెందిన దాత రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అఖిల భారత పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ కె. గోపాల్ రూ.5 లక్షల చెక్కును ఆలయ ఈవో గీతకు అందజేశారు.