తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం - యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రీశుడి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం కావడం వల్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్య కల్యాణ వేడుకల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Yadadri Sri lakshmi Narasimha swamy temple premises were crowded with devotees in yadadri bhuvanagiri district
యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం

By

Published : Feb 21, 2021, 2:10 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ జరిపి, ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆదివారం కావడం వల్ల ఆలయంలో భక్తులు సందడి నెలకొంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణకట్టతో పాటు కొండపైన గర్భాలయం, మాడవీధులు, ప్రసాద విక్రయ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కొండ పైకి వాహనాలను అనుమతించడంలేదు.

స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం, ధర్మ దర్శనానికి 2గంటలు పడుతోంది. ఆరాధన, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, అష్టోత్తర పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రిలోని శివాలయ సాలహారాలకు నూతన హంగులు

ABOUT THE AUTHOR

...view details