తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే యాదాద్రీశుడి జయంత్యుత్సవాలు - తెలంగాణ వార్తలు

యాదాద్రీశుడి జయంత్యుత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు స్వస్తివాచనం, పుణ్య వాచనం, రక్షాబంధనంతో వేడుకలు ప్రారంభించనున్నారు.

Yadadri sri lakshmi narasimha swamy , yadadri temple
నారసింహుని జయంత్యుత్సవాలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు

By

Published : May 23, 2021, 8:51 AM IST

శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలకు యాదాద్రి క్షేత్రం ముస్తాబైంది. ఈ వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలాలయంలో యాగశాల, రాగి కలశాలను సిద్ధం చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగానే ఈ మహోత్సవాలు జరపనున్నారు. నేడు స్వస్తివాచనం, పుణ్య వాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఉదయం శ్రీవెంకటపతి అలంకార సేవ, సాయంత్రం గరుడవాహనంపై పరవాసు దేవ అలంకారసేవ, లక్ష పుష్పార్చన నిర్వహించనున్నారు.

రేపు ఉదయం కాళీయమర్థని అలంకార సేవ, లక్ష కుంకుమార్చన, నృసింహ మూల మంత్రహవనం నిర్వహించనున్నారు. సాయంత్రం హనుమంత వాహనంపై రామావతార అలంకార సేవ జరపనున్నారు. చివరి రోజు ఉదయం పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవాలను ముగించనున్నారు.

ఇదీ చదవండి:కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ ముందుకొస్తున్న మానవతామూర్తులు..!

ABOUT THE AUTHOR

...view details