యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఏడు రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
temple
పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, 108 కలశాల జలంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం అనంతరం మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.