తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి ప్రాంగణం - యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

ఉగాది పండుగ వేళ వరుసగా సెలవులు రావడం... అందులోనూ ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. చిన్న పెద్ద అందరూ... దేవుని దర్శనం కోసం లక్ష్మీనరసింహుని ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి ఆలయ ప్రాంగణం

By

Published : Apr 7, 2019, 4:49 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం వల్ల.. యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం సందడి పెరిగింది. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి వచ్చి... నరసింహుడిని దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details