ద్విచక్రవాహనం పైనుంచి కింద పడిన దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు యాదాద్రి భువనగరి రూరల్ పోలీసులు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయిగిరి శివారులో బైక్‌పై వెళ్తున్న దంపతులు అదుపు తప్పి క్రింద పడిపోయారు. స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం అందించారు. అరగంట దాటినా అంబులెన్స్ రాలేదు.
మానవత్వం చాటుకున్న యాదాద్రి రూరల్ పోలీసులు - తెలంగాణ తాజా వార్తలు
బైక్ పై నుంచి అదుపు తప్పి కింద పడ్డ దంపతులను పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఈఘటన యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

yadadri news
మరో వైపు లాక్డౌన్ సమయం కావటం వల్ల ప్రత్యామ్నాయ వాహనాలు లేవు. విషయం తెలుసుకున్న భువనగిరి రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:మానసిక ధైర్యంతోనే కొవిడ్‌ను జయించాలి : హరీశ్ రావు