తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి వలయరహదారి పనులు వేగవంతం - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్​నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పనులు వేగవంతమయ్యాయి. వలయ రహదారి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మూడు వైపులా ఉన్న రహదారులను కలిపే పనులు పూర్తయ్యాయి.

yadadri
yadadri

By

Published : May 14, 2021, 7:36 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా కొండచుట్టూ చేపడుతున్న వలయ రహదారి విస్తరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. వైకుంఠ ద్వారానికి ఎదురుగా కూడలి రోడ్డు పనులు జరుగుతున్నాయి. మూడు వైపులా ఉన్న రహదారులను కలిపే పనులు పూర్తయ్యాయి. వలయ రహదారి పనులు దాదాపు 70శాతం పూర్తిగా వచ్చాయని... అధికారులు తెలిపారు.

కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నివాస గృహాల, దుకాణ సముదాయాలను, కూల్చివేతకు మార్కింగ్​ పనులు చేపట్టిన ఆర్​అండ్​బీ అధికారులు.. విస్తరణలో తొలగించే 35 ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి 2,3 రోజుల్లో తొలగింపు పనులు చేపడతామని తెలుపుతున్నారు. నివాస గృహాల్లో దుకాణాల సముదాయులతో ఉన్న సామగ్రి... తదితర వాటిని ఖాళీ చేసి.. వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు బాధితులు. విద్యుత్​ అధికారులు కరెంట్​ స్తంభాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. మరోవైపు బాధితులు వారి ఇళ్ల తొలగింపు ప్రక్రియపై కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details