యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు మ్యాప్‌ను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా గుట్ట దిగువన ఉన్న పురాతన ఆంజనేయస్వామి ఆలయం, రావి చెట్టు తొలగింపునకు సంబంధించిన వివరాలను అందించాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ప్రాజెక్ట్ భూసేకరణలో భాగంగా ఆర్అండ్బీ, ఈఈ రాసిన లేఖను అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 27న తేదీకి వాయిదా వేసింది.
మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు...
అప్పటివరకు ఆలయంతో పాటు అక్కడ ఉన్న చెట్టును తొలగించరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన ఆంజనేయ స్వామి ఆలయం రావి చెట్టును తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ వానరసేన సంస్థ తరఫున, అధ్యక్షుడు ఎన్ రామిరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ పి.విజయ్ సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
ఇవీ చూడండి : తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్