యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా... ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా భక్తితత్వం ప్రతిభింబిచేలా శిల్ప రూపాల ఏర్పాట్లకు యాడ యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించే క్రమంలో శ్రీ కృష్ణ భగవానుడి మహత్యాన్ని విగ్రహాలతో ఆలయం చుట్టు వెలుపల, మండవ ప్రాకారాలపై గల సాలహారాలను తీర్చిదిద్దనున్నారు. ఆ క్రమంలో కృష్ణుడి శిల్ప రూపాలను ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో శిల్పులు చెక్కుతున్నారు. వైష్ణవ తత్వం ఉట్టి పడేలా యాదాద్రి ప్రధాన ఆలయాన్ని రూపొందించాలని చిన్న జీయర్ స్వామి ఇచ్చిన సలహాలు సూచనల్లో భాగంగా కృష్ణ రూపాల పొందికపై ప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది.
యాదాద్రిలో ఆధ్యాత్మిక హంగులు... కోవెలకుంట్లలో శిల్ప రూపాలు - yadadri renovation updats
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత ప్రతిభింభించేలా శిల్పరూపాల ఏర్పాట్లకు యాడా కసరత్తుచేస్తోంది.
జీయర్ స్వామి సూచనలతో తొలుత పింక్ గ్రానైట్‌తో తయారీ చేయించాలి అనుకున్నారు. మార్పుల్లో భాగంగా సీఎం కేసీఆర్ జోక్యంతో కృష్ణ శిలతో కోవెలకుంట్ల శిల్పకారులు వాటిని చెక్కుతున్నట్లు సమాచారం. మరో రెండు వారాల్లో ఆ విగ్రహాలు యాదాద్రికి రానున్నాయని అధికారులు అంటున్నారు. పునర్నిర్మాణం పనులన్నీ చివరి దశకు చేరాయని యాడ చెబుతోంది. ఇప్పటి వరకు రూపొందించిన మండవ ప్రాకారాలు ఆళ్వారుల మండపం, స్వాగతించే ప్రతిమలకు తుది మెరుగుల పనులు పూర్తయ్యాయని ప్రధాన స్థపతి తెలిపారు.
గర్భాలయంపై నిర్మితమైన విమానాన్ని బంగారు తొడుగులతో స్వర్ణమయం గావించే ప్రణాళికను అమలు చేసేందుకు ఆలయ నిర్వాహకులు యత్నిస్తున్నారు.