యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అణువణువూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. ప్రాకారాలలోని శిల్పాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
క్షేత్ర అభివృద్ధి పనులను మరో 2 లేదా 3 నెలల్లో పూర్తి చేయాలనే సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ప్రధాన ఆలయ పనులను ప్రధాన స్తపతి పర్యవేక్షణలో అధికారులు వేగవంతం చేశారు. స్వామి కొలువై ఉన్న మాడ వీధుల్లో ఫ్లోరింగ్ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.