యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తుదిదశకు చేరుకుంది. 2014 సంవత్సరం అక్టోబర్ నెలలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో యాదగిరి నరసింహుని దర్శనం చేసుకున్న్ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. రెండువేల ఎకరాల భూమి సేకరించి.. రూ.1200 కోట్ల అంచనాలతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కెసిఆర్, స్వీయ పర్యవేక్షణలో యాదాద్రి కొండపై ప్రధానాలయ పనులు తుదిదశకు చేరాయి.
పూర్తి కావస్తున్న యాదాద్రి పునర్నిర్మాణం - యాదాద్రి ఆలయం
తెలంగాణ ఆధ్యాత్మిక నగరంగా యాదాద్రి రూపు దిద్దుకుంటున్నది. రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ యాదాద్రిని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట నిజం కానుంది.
ప్రధానాలయం ప్రాకార గోపురాలు, గర్భాలయం, గర్భాలయ ద్వారాలు, వాటిపై పంచలోహ మూర్తులు ముఖద్వారంపై ప్రహ్లాద చరిత్ర, ఆళ్వారుల రాతి స్తంభాలతో, ప్రధాన ఆలయ మండపం అందులో ఉప ఆలయాలు అష్టభుజి ప్రాకార మండపాలు, అంతర్ ప్రాకార మండపాలు నలువైపులా దేవతామూర్తుల అమరికలు పూర్తి కావచ్చాయి. బ్రహ్మోత్సవ కళ్యాణ మండపం రామానుజ కూటమి పనులు కళాత్మకత ఉట్టిపడే రీతిలో పూర్తి చేశారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ 900 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.300 కోట్లు వెచ్చించి పూర్తి నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాబోయే కార్తీకమాసం నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి 2021 ఫిబ్రవరిలో జరిగే స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల నాటికి1008 కుండాత్మక మహా సుదర్శన నారసింహ యాగం నిర్వహించి ఆలయ ఉద్ఘాటన వేడుకలు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం