యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా బస్బే, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. బస్బే, వాహనాల పార్కింగ్ కోసం రక్షణ గోడల నిర్మాణాలు, కొనసాగుతున్నాయి. నాలుగంతస్తులో ప్రసాదాల తయారీ భవనం పూర్తైంది. మూడో అంతస్తులో యంత్ర పరికరాల బిగింపు మొదలైంది. లడ్డూ ప్రసాదాల, విక్రయ కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అత్యాధునికంగా విష్ణు పుష్కరిణి
యాదాద్రి కొండపైన స్వామివారి కైంకర్యాల కోసం విష్ణు పుష్కరిణి నిర్మాణం వేగమందుకుంది. ముందుగా రూ.5.2 కోట్ల వ్యయంతో చాలా విశాలంగా విష్ణు పుష్కరిణి నిర్మాణం చేపట్టారు. స్థలం తక్కువగా ఉన్న కారణంగా ఆ పుష్కరిణి ఆకృతిని మార్చాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాడా అధికారులు రీడిజైన్ చేశారు. 19 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో లక్ష లీటర్ల నీటి సామర్థ్యంతో విష్ణు పుష్కరిణి నిర్మిస్తున్నారు. 20 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి మళ్లీ ఆ నీటిని వినియోగించుకునేందుకు యంత్రాలను అమర్చనున్నారు.