యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలిగొండ , భూదాన్ పోచంపల్లి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయమే చాలా మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కనిపించింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడం వల్ల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్, జలాల్ పురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్ - mptc
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాదేశిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత వల్ల వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్