యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాల అనంతరం వచ్చే నెల 1 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే, ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనాలని అర్చకులు కోరారు..
యాదాద్రిలో పవిత్రోత్సవాలు.. పాల్గొన్న అటవీశాఖ ఏడీజీ - యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
యాదాద్రి ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. పాల్గొన్న అటవీశాఖ ఏడీజీ
పవిత్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు.