యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు.. 28న ముగుస్తాయని వెల్లడించారు.
యాదాద్రిలో బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు - పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
యాదాద్రిలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. రేపటి నుంచి నాలుగు రోజులు పాటు అధ్యయనోత్సవాలు ముగియగానే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
యాదాద్రిలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
ఈనెల 23న ధ్వజారోహణం, 24న స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 25న కళ్యాణోత్సవం, 26న రథోత్సవం, 27 చక్రతీర్థం జరుగుతాయని పేర్కొన్నారు. 28న శత ఘటాభిషేకంతో పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ముగియగానే బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి:పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి హరీశ్ శ్రీకారం