'ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వాలి' - yadgiri gutta
యాదగిరిగుట్ట పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను పరష్కరించాలని సీపీఐ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
నల్లా కనెక్షన్లు ఇవ్వాలి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని నీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పట్టణంలోని ప్రశాంత్‌నగర్, ఇందిర కాలనీ, అంగడిబజార్‌లో నీటి సమస్య ఎక్కువగా ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించిన తమ సమస్యను పట్టించుకోవటంలేదని వాపోయారు. నీటి ఎద్దడి సమస్యను తీర్చాలని... ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.