ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల25న ప్రారంభమై ఉత్సవాలు ఈ నెల 30న వరకు ముగియనున్నాయి. మూడోరోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంత్రం వెంకటేశ్వర స్వామి అవతారంలో అలంకరించి... బాలాలయంలో ఊరేగించారు.
యాదాద్రిలో మూడోరోజు వైభవంగా అధ్యయనోత్సవాలు - యాదాద్రిలో మూడోరోజు అధ్యనోత్సవాలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు వెంకటేశ్వరస్వామి అవతారంలో దర్శనమిచ్చారు. అలంకరణ అనంతరం బాలాలయంలో స్వామివారిని ఊరేగించారు.
వెంకటేశ్వరస్వామి అవతారంలో యాదాద్రి నరసింహుడు
స్వామి వారిని వెంకటేశ్వర స్వామి అవతారంలో వజ్ర, వైడూర్యాలతో అలంకార సేవపై నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మంగళ వాయిద్యాల మధ్య, వేదపండితుల దివ్య ప్రబంధ పారాయణాలతో ప్రత్యేక పూజలతో ఘనంగా జరిగాయి. అనంతరం వెంకటేశ్వర స్వామి అవతార విశిష్టతను ఆలయ అర్చకులు తెలిపారు.