తెలంగాణ

telangana

ఆన్​లైన్​లో యాదాద్రి నరసింహ స్వామి ఆర్జిత సేవలు

కరోనా వ్యాప్తి కట్టడికి అమలౌతున్న నిషేధాజ్ఞల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి నరసింహ స్వామి ఆలయంలో నేటి నుంచి ఆన్​లైన్​లో పూజా సౌకర్యం కల్పిస్తున్నారు. ఆన్​లైన్​లో రుసుము చెల్లించిన వారి గోత్ర నామాల పేరిట పూజలు నిర్వహిస్తున్నారు.

By

Published : Apr 21, 2020, 4:46 PM IST

Published : Apr 21, 2020, 4:46 PM IST

Breaking News

లాక్​డౌన్ నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనుటకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పరోక్షంగా పూజలు నిర్వహించేందుకు ఈరోజు నుంచి ఆన్​లైన్ పూజా విధానం కల్పిస్తున్నారు. నిన్నటి నుంచి పరోక్ష పద్ధతిలో పూజలు ప్రారంభించి, ఈరోజు నుంచి ఆన్​లైన్​లో నిజాభిషేకంకు రూ. 500, సహస్రనామార్చనకు రూ. 500, సుదర్శన నారసింహ హోమంకు రూ. 1,116, స్వర్ణ పుష్పార్చనకు రూ. 500 చెల్లించిన వారికి గోత్ర నామాల పేరుతో పరోక్ష పద్ధతిలో పూజలు నిర్వహిస్తున్నారు.

ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకోవాలనుకునే వారు https://ts.meeseva.telangana.gov.in వెబ్​సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పలువురు భక్తులు ఆన్​లైన్ ద్వారా ఈరోజు ఉదయం నిజాభిషేకం, సుదర్శన నారసింహ హోమంలో స్వామివారికి పూజలు చేయించుకున్నారు.

ఆన్​లైన్​లో యాదాద్రి నరసింహ స్వామి ఆర్జిత సేవలు

ఇదీ చూడండి :మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details