మురళీకృష్ణుడిగా నరసింహుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంవంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజుముల్లోకాలను ఏలే జగత్ స్వరూపుడైన మురళీకృష్ణుడి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, వజ్ర వైఢూర్యాలతో స్వామి వారు ముస్తాబయ్యారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ బాలాలయంలో ఊరేగారు. నయనానందకరంగా, ముగ్ధమనోహరంగా సాగిన ఈ వేడుక భక్త జనులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు రాత్రి లక్ష్మీ నరసింహుడు హంస వాహనంపై విహరించనున్నారు.
ఇవీ చదవండి:ఉమామహేశ్వర ఆలయంలో చోరీ