తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరువెంకటపతి అలంకరణలో యాదాద్రి నరసింహుడు - యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో నృసింహ జయంతి ఉత్సవాలు

నృసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి తిరువెంకటపతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లాక్​డౌన్ కారణంగా ఆలయంలోకి భక్తులెవరినీ అనుమతించలేదు. పూజారులు కూడా భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

nrusimha jayanthi celebrations
తిరువెంకటపతి అలంకరణలో యాదాద్రి నరసింహుడు

By

Published : May 4, 2020, 7:39 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో నృసింహ జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాలలో మొదటి రోజు భాగంగా ఈ రోజు ఉదయం తిరు వెంకటపతి అలంకరణలో స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు.

స్వామివారిని వజ్ర వైడూర్యాలతో, వివిధ రకాల పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు... వేదపండితుల వేదపారాయణాల నడుమ స్వామి వారి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. లాక్​డౌన్ కారణంగా ఆలయంలోకి భక్తులెవరినీ అనుమతించలేదు. అర్చకులు కుడా భౌతిక దూరం పాటిస్తూ... పూజలను నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసుల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details