యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం సభాధ్యక్షులుగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎంపీటీసీలకు ప్రభుతం తరుఫున కనీస నిధులైనా కేటాయించాలని, అలాగే నెలసరి కనీస వేతనంగా 25 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
'ఎంపీటీసీలకు కనీస వేతనం చెల్లించాలి' - Yadadri MPTC Meetings in Yadadri district
యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపీటీసీల చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
!['ఎంపీటీసీలకు కనీస వేతనం చెల్లించాలి' Yadadri MPTC Meetings in Yadadri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5338519-108-5338519-1576054441262.jpg)
'ఎంపీటీసీలకు కనీస వేతనం చెల్లించాలి'
గ్రామాల్లో సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ఉన్న విలువ ఎంపీపీ, ఎంపీటీసీలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయమని ప్రజలు అడిగితే వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని వెల్లడించారు.
'ఎంపీటీసీలకు కనీస వేతనం చెల్లించాలి'
ఇవీచూడండి: మీ చరవాణే.. మీ మెట్రో టికెట్