యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలోని గిరిజన ఆరాధ్య దేవాలయంలోని దేవ నాయకుల మర్రి చెట్టు ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి ఓ వైపు కుప్పకూలింది. ఎకరన్నర విస్తీర్ణంలో ఉన్న ఈ మర్రి చెట్టు సుమారు ఐదు వందల సంవత్సరాల కాలం నాటిదని అక్కడి పూజారి భీమా నాయక్ తెలిపారు. ఎంతో విశిష్టత , మహిమ కలిగిన ఈ క్షేత్రానికి గిరిజనులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తుంటారని వెల్లడించారు. కుప్పకూలిన సమయంలో భక్తులు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఏళ్లనాటి మర్రి చెట్టు కూలిపోవడం వల్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుప్పకూలిన ఐదు వందల ఏళ్ల నాటి మర్రిచెట్టు - tress
యాదాద్రి జిల్లాలోని మల్లాపురం గ్రామంలో గల గిరిజన ఆరాధ్య దేవాలయంలోని ఐదు వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు ఈదురుగాలుల బీభత్సానికి కుప్పకూలింది. ఏళ్లనాటి మర్రి చెట్టు కూలిపోవడం వల్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
![కుప్పకూలిన ఐదు వందల ఏళ్ల నాటి మర్రిచెట్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3281160-thumbnail-3x2-marri.jpg)
కుప్పకూలిన ఐదు వందల ఏళ్ల నాటి మర్రిచెట్టు