ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు.
గోవర్ధనగిరి ధారి ఆకారంలో దర్శనమిచ్చిన యాదాద్రి నరసింహుడు - గోవర్ధనగిరి ధారి ఆకారంలో దర్శనమిచ్చిన యాదగిరి నరసింహుడు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు... స్వామివారు గోవర్ధనగిరి ధారి ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
![గోవర్ధనగిరి ధారి ఆకారంలో దర్శనమిచ్చిన యాదాద్రి నరసింహుడు bhadradri brahmothsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6268674-92-6268674-1583150363493.jpg)
గోవర్ధనగిరి ధారి ఆకారంలో దర్శనమిచ్చిన యాదాద్రి నరసింహుడు
ఆరవరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు గోవర్ధనగిరి ధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో, నయన మనోహరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాలు, వేదపారాయణలతో.. స్వామివారిని ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి సేవ వద్ద అర్చకులు గోవర్ధన గిరిధారి అవతార విశిష్టత తెలియజేశారు.
గోవర్ధనగిరి ధారి ఆకారంలో దర్శనమిచ్చిన యాదాద్రి నరసింహుడు
ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య