యాదాద్రి దేవస్థానంలోప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న నల్లంథిగళ్ లక్ష్మీనరసింహాచార్యులకు ఆగమ రత్న చూడామణి అనే బిరుదు ప్రదానం చేశారు. తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ పౌండరీకపురం శ్రీమదాండవన్ ఆశ్రమం వారు దీనిని ప్రకటించారు. కొవిడ్ దృష్ట్యా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పోస్టు ద్వారా యాదాద్రికి పంపించారు.
యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులకు ఉత్తమ పురస్కారం - యాదాద్రి తాజా వార్తలు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలోప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న నల్లంథిగళ్ లక్ష్మీనరసింహా చార్యులకు ఆగమ రత్న చూడామణి అనే బిరుదు ప్రదానం చేశారు.
యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులకు ఉత్తమ పురస్కారం
యాదాద్రి ఆలయ ఈవో గీత, అధికారుల సమక్షంలో ఈ పురస్కారాన్ని ప్రదాన అర్చకులకు అందజేశారు. శ్రీగోపాలదేశిక మహా దేశిక శతమాన మహోత్సవం సందర్భంగా దీనిని వారికి అందజేశారు. ఆగమశాస్త్రంలో వారు చేసిన చేసిన సేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆలయ ఈవో గీతా రెడ్డి, అర్చకులు, సిబ్బంది, ఆలయ అధికారులు ప్రధానార్చకులను అభినందించారు.