యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 18 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. 35,36,736 రూపాయల నగదు, 24 గ్రాముల బంగారం, కిలో వెండి ఆలయ ఖజానాకు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి వెల్లడించారు.
యాదాద్రీశుడి హుండీ లెక్కింపు... 18రోజులకు 35లక్షలు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కించారు. 18 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని సిబ్బంది గణించారు.
యాదాద్రీశుడి హుండీ లెక్కింపు... 18రోజులకు 35లక్షలు
ఉద్యోగులు, సిబ్బంది మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆదాయం లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'ఉపాధి హామీ పనుల కోసం ఫోన్ చేయండి'